అలెంబిక్ మందుకు అవెురికా అనుమతి

Updated By ManamWed, 07/11/2018 - 22:13
 Alemanne

 Alemanneన్యూఢిల్లీ: వయోజనులలో షిజోఫెర్నియా చికిత్సకు వాడే లోపెరిడోన్ ట్యాబ్లెట్లకు అవెురికా ఆహార, ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ నుంచి తాత్కాలిక అనుమతి లభించినట్లు  ఆ మందులను తయారు చేసే అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ వెల్లడించింది. 1 మిల్లీ గ్రాము, 2 మిల్లీ గ్రాములు, 4 మిల్లీ గ్రాములు, 6 మిల్లీ గ్రాములు, 8 మిల్లీ గ్రాములు, 10 మిల్లీ గ్రాములు, 12 మిల్లీ గ్రాముల మోతాదులలో మందుకు అనుమతి లభించినట్లు ఆ సంస్థ బి.ఎస్.ఇకి నివేదించింది. వందా ఫార్మాస్యూటికల్స్ ఇన్‌కార్పొరేటెడ్ తయారు చేసే రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్ ప్రాడక్ట్ ఫానాప్ట్‌కి ఈ మందు చికిత్సాపరంగా సమానమైనదని వెల్లడైంది. లోపెరిడోన్ ట్యాబ్లెట్లకు అవెురికాలో 2017 డిసెంబర్‌తో ముగిసిన 12 నెలల కాలంలో 128 మిలియన్ల డాలర్ల మేర మార్కెట్ ఉన్నట్లు అంచనా. అవెురికా ఆహార, ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ నుంచి ఇంతవరకు మొత్తం 74 మందులకు అనుమతి సంపాదించినట్లు అలెంబిక్ చెప్పుకుంది. అలెంబిక్ షేర్ ధర బి.ఎస్.ఇలో రూ. 526.75 వద్ద కోట్ అవుతోంది. 

Tags
English Title
Alemanne is taking Avenura's permission
Related News