అమలాపాల్ మాజీ భర్తకు రెండో పెళ్లి..!

Updated By ManamSat, 07/07/2018 - 10:54
al vijay

al vijay 2014లో ఒక్కటైన అమలాపాల్, దర్శకుడు ఏఎల్ విజయ్ మనస్పర్థల కారణంగా 2016లో విడిపోయారు. ఆ తరువాత వీరిద్దరు వారి వారి వృత్తిలో బిజీ అయిపోయారు. ఓ వైపు అమలాపాల్ వరుస సినిమాలు చేస్తుండగా.. మరోవైపు ఏఎల్ విజయ్ డైరక్షన్‌లో బిజీ అయిపోయాడు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం విజయ్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు అమ్మాయిని వెతికే పనిలో విజయ్ తల్లిదండ్రులు పడ్డట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలను విజయ్ సన్నిహితులు కొట్టివేస్తున్నారు. విజయ్‌కు రెండో పెళ్లి ఆలోచనలు లేవని వారు అంటున్నారు. కాగా విజయ్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు గతంలో కూడా వార్తలు రాగా.. వాటిని అతడు ఖండించిన విషయం తెలిసిందే.

English Title
AL Vijay is ready for second Marriage..?
Related News