‘భారతీయుడు 2’లో విలన్‌గా బాలీవుడ్ హీరో

Updated By ManamFri, 07/06/2018 - 10:25
Kamal, shankar

kamal, ajay ప్రస్తుతం రజీనకాంత్ నటించిన ‘2.O’ పోస్ట్ ప్రొడక్షన్‌లో మునిగిన దర్శకుడు శంకర్.. ఈ చిత్రం తరువాత కమల్ హాసన్‌తో ‘భారతీయుడు’ సీక్వెల్‌ను తెరకెక్కించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజా సమచారం ప్రకారంలో ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

రజనీకాంత్ 2.O కోసం బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్‌ను తీసుకున్న శంకర్.. అదే తరహాలో భారతీయుడు 2 కోసం కూడా అజయ్ దేవగన్‌ను ఎన్నుకోవాలని అనుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగినట్లే. కాగా ఈ చిత్రంలో కమల్ సరసన నయనతారను తీసుకోవాలని అనుకుంటుండగా.. సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఫైనల్ అయినట్లు సమాచారం.

English Title
Akshay Kumar turns villian for Kamal Haasan
Related News