పవన్ సీన్లను వాడుకుంటున్న అఖిల్..?

Updated By ManamFri, 11/02/2018 - 13:13
Pawan Kalyan, Akhil
Pawan Kalyan, Akhil

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఒక సాంగ్ మినహా దాదాపుగా ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేయగా.. ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో వినిపిస్తుంది.

అదేంటంటే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ హిట్ మూవీ ‘అత్తారింటికి దారేది’లోని రెండు సీన్లను వాడుకొంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అఖిల్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

English Title
Akhil used Pawan Kalyan scenes..?
Related News