ఫేస్‌బుక్‌ లైవ్‌లో సూసైడ్

Updated By ManamThu, 07/12/2018 - 12:06
Agra youth munna kumar
agra youth munna kumar

ఆగ్రా : 'మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడూ.. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడూ..' అనేది అక్షరాలా వాస్తవ రూపం దాల్చుతోంది. రాజస్తాన్‌లో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడితే...వారిని సాయం చేద్దామనే ఇంగితం లేకుండా సెల్ఫీలు తీసుకున్న ఘటన మరవక ముందే... మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కళ్ల ముందే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటుంటే  ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు.

ఆగ్రాలోని ఓ యువకుడు ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్య చేసుకుంటుంటే... ఆ వీడియోను వందలమంది చూసేరే కానీ... ఆపేందుకు ప్రయత్నించలేదు సరికదా... కనీసం పోలీసులకు సమాచారం కూడా అందించలేదు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆగ్రాలోని శాంతి నగర్‌కు చెందిన మున్నా కుమార్ నిన్న ఉదయం.. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ వీడియో తీస్తూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ లైవ్ వీడియాను 2,750మంది చూసినప్పటికీ...ఎవ్వరూ మున్నా కుటుంబీకులకు సమాచారం ఇవ్వలేదు. ఆర్మీ ప్రవేశ పరీక్షలో ఫెయిల్ అయిన అతడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రెండు పేజీల సూసైడ్ లెటర్‌ రాశాడు. తనను క్షమించాలని తల్లిదండ్రులను ఆ లేఖలో కోరాడు.

agra youth munna kumar

కాగా భగత్ సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకున్న మున్నాకు ఎప్పటికైనా ఇండియన్ ఆర్మీలో చేరాలనేది చిరకాల వాంఛగా అతడి సోదరుడు వికాస్ కుమార్ తెలిపాడు. మున్నా ఇప్పటి వరకూ ఆర్మీ ఎంట్రెన్స్ పరీక్ష అయిదు సార్లు రాసినా క్వాలిఫై కాలేదని వెల్లడించాడు. అయితే సూసైడ్ చేసుకోవాడానికి ముందు కూడా మున్నా కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశాడని, అందరితో బాగానే ఉన్నాడని ...ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడతాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.

English Title
Agra youth munna kumar commits suicide,Live-Streams It on Facebook
Related News