లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా.. ఐసీసీ కఠిన చర్యలు

Updated By ManamWed, 10/17/2018 - 01:36
ICC
  • స్పోర్ట్స్‌లో ‘మీ టూ’ ఉద్యమం

  • ఐసీసీ సమావేశాలు షురూ

ICCముంబై: వరల్డ్ కప్, అండర్-19 టోర్నీలతో పాటు ఐసీసీ ఈవెంట్స్ అన్నింటిలో నుంచి లైంగిక వేధింపుల భూతాన్ని తరిమి కొట్టాలని ప్లేయర్స్, కోచ్‌లు, టీమ్ అధికారులు, జర్నలిస్ట్‌లు, అమ్మకం దారులు కోరుకుంటున్నారు. భారత్‌లో ‘మీ టూ’ ఉద్యమం రోజు రోజుకు ఉధ్రుతమవుతున్న సమయంలో మీడియా, అడ్వర్టైజింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు చెందిన అనేక మంది హై ప్రొఫైల్ వ్యక్తులపై ఆరోపణలు వస్తున్నాయి. వర్క్ ప్లేస్ నుంచి ఈ లైంగిక వేధింపులను తరిమికొట్టడానికి ఐసీసీ కఠిన చర్యలు తీసుకోబోతంది. బుధవారం సింగపూర్‌లో జరగనున్న ఐసీసీ సమావేశానికి టెస్టు దేశాల చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ హాజరు కాబోతున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొనే వారెవరినైనా ఐసీసీ టోర్నీలకు రానీయొద్దని ఐసీసీ ఖరా ఖండిగా ఈ సమావేశంలో చెప్పబోతోంది. అంటే లైంగిక వేధింపుల ఆరోపణలు లేని వ్యక్తి మాత్రమే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ లేదా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు స్టేడియంలోకి అనుమతిస్తారు. గతంలో కూడా ఈ క్రికెట్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు తెర మీదికి వచ్చాయి. బెంగళూరుకు చెందిన సీనియర్ క్రికెట్ జర్నలిస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాని ఓ మహిళా జర్నలిస్ట్ ఆరోపించింది. తాజాగా కొద్ది రోజుల క్రితం బీసీసీఐ సీఈఓ రాహుల్ జొహ్రిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. జొహ్రీ గతంలో చేసిన ఉద్యోగంలో వేధింపులకు పాల్పడ్డట్టు సోషల్ మీడియాలో ఓ అజ్ఞత మహిళ ఆరోపించింది. రాహుల్ జొహ్రీ ఉదంతంతో ఐసీసీ కఠిన చర్యలు చేపట్టడం లేదని.. ఈ ఏడాది ఆరంభంలో యూఎస్ జిమ్నాస్టిక్స్ కోచ్ లార్రీ నాస్సర్ అనేక మంది అమ్మాయిలను లైంగికంగా వేధించారని వచ్చిన వార్తలతో దుబాయ్‌లోని హెడ్ క్వార్టర్‌లో ఆలారమ్ బెల్ మోగిందని ఐసీసీ వర్గాలు చెప్పాయి. వర్క్ ప్లేస్ నుంచి లైంగిక వేధింపులను తరిమి కొట్టడమే తమ ఏకైక లక్ష్యమని ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఐసీసీ ఇప్పటికే కొంత మంది మహిళా జర్నలిస్ట్‌లతో మాట్లాడింది. మహిళా అథ్లెట్లకు పూర్తి భద్రత కల్పించడమే తమ లక్ష్యమని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక జొహ్రీ విషయానికొస్తే.. ఇప్పటికే ఆయనను వివరణ కోరుతూ బీసీసీఐ సీఓఏ లేఖ రాసింది. ఆ వివరణ కోసం ఐసీసీ కూడా ఎదురు చూస్తోంది. 

Tags
English Title
Against Sexual Assault .. ICC strict actions
Related News