జగన్ ఛాంబర్‌లో మళ్లీ వర్షం నీళ్లు

Again YS Jagan mohan reddy Secretariat Chamber Flooded Yet

అమరావతి : పెథాయ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి అమరావతిలోని ప్రభుత్వ భవనాల్లో మరోసారి డొల్లతనం బయటపడింది. ప్రతిపక్ష నేత,  వైఎస్సార్ సీపీ  అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాంబర్‌లోకి మళ్లీ వర్షం నీరు చేరింది. గోడల నుంచి నీళ్లు కారడంతో వైఎస్సార్ సీపీ నేతలు మండిపడుతున్నారు. కొద్దిపాటి వర్షాలకే అసెంబ్లీ తాత్కాలిక భవనాల్లో నీళ్లు కారడంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తెల్లతేటం అవుతోందన్నారు. గతంలో కూడా వైఎస్ జగన్ చాంబర్‌లోకి నీరు చేసిన విషయం తెలిసిందే. అయితే దాన్ని అధికార పార్టీ నేతలు ...కావాలనే రాద్దాంతం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు కూడా. తాజాగా మళ్లీ లీకేజీ బయటపడటం గమనార్హం.

సంబంధిత వార్తలు