అలోక్‌వర్మ బాధ్యతల స్వీకరణ

alok verma

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తిరిగి తన పూర్వ బాధ్య తలను చేపట్టారు. బుధవారం ఉదయం సీబీఐ కార్యాల యానికి చేరుకొని బాధ్యతలను స్వీకరించారు. కోర్టు తీర్పు మేరకు ఈ సమయంలో ఆయనకు పరిమితమైన అధికా రాలు మాత్రమే ఉండనున్నాయి. అలోక్‌పై వచ్చిన ఆరోప ణల నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబరు 23న బలవంతపు సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ధర్మాసనం ఆలోక్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఎంపిక కమిటీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఆయన్ను అధికారం నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ స్వతంత్రతను కాపాడేందుకు, సీబీఐ డైరెక్టర్ అధికారాలకు నిరోధం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సబీఐ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టే క్రమంలో ఆలోక్ వర్మ.. విధాన పరమైన ప్రధాన నిర్ణయాలేవీ తీసుకొనే అవకాశం ఉండదని కోర్టు స్పష్టం చేసింది. ఆయన కొనసాగింపుపై అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ నిర్ణయం వెలువరించే వరకూ ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. ఇందుకోసం ఎంపిక కమిటీకి కోర్టు వారం రోజుల  సమయం ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మ రెండేళ్ల పదవీ కాలం జనవరి 31తో ముగియనుంది.

Tags

సంబంధిత వార్తలు