అస్తిత్వ సంక్షోభంలో ఆదివాసీలు

Updated By ManamThu, 08/09/2018 - 01:16
adivasi

adivasiఆదిమ తెగలు (పిటిజి) రేనా / రోనా, కట్టు నాయకన్, కొండరెడ్లు, భిల్లులు, తాటి, చెమల జనాభా) సంతానోత్పత్తి రేటు క్షీణించడం, శిశు మరణాలు, పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలతో కనుమరుగైపోతున్న తరుణమిది. ఈ దశలో తెగలు, జనాభా సమగ్రంగా, శాస్త్రీయంగాలేని పక్షంలో గిరిజన ఉపప్రణాళిక (టిఎస్‌పి)లో నిధులు ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు? ఏజెన్సీ గిరిజనులకే కెటాయించిన 1/70 చట్టం, ఫెసా (పంచాయత్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్) చట్టం, విద్య, ఉద్యోగాల ఉత్తర్వులు, సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు ఎలా అమలు చేయగలుగుతారు? ప్రాథమిక విద్య నుంచి చిరుద్యోగాల వరకే వీరికి రిజర్వేషన్ను వర్తింపజేస్తే, వైుదాన గిరిజనుల కింద పోటీ పడలేని అగ్రకులాల కింద నలిగిపోవలసిన పరిస్థితులు తలెత్తకుండా వారి అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నది. వారిపై పెత్తనం చెలాయిస్తున్న వారి ఆటలను అరికడితేనే మూలవాసులైన ఆదివాసీల జీవనవిధానం వెురుగుపడుతుంది.

ప్రపంచ చరిత్ర ఆదివాసీలది!
ప్రపంచ సంపద ఆదివాసీలది!
ప్రపంచ అలవాట్లు ఆదివాసీలది!
ప్రపంచ ప్రకృతి ఆదివాసీలది!
కాని స్వయం నిర్ణయాధికారం మాత్రం ఆదివాసీలది కాదు?

ప్రపంచ వ్యాప్తంగా సమాజంలో ముందుతరం వారు ఎవరంటే? ఆదివాసీలు మూలవాసీలు, వనవాసీలుగా చెప్పుకో వచ్చు సహజన్యాయం ప్రకారం వారు అభివృద్ధిలో అందరికీ అందనంత ముందంజలో ఉండాలి, కాని కొందరు కానరాని, మరికొందరు కనుమరుగయ్యే దశలో కొట్టుమిట్టాడు తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆదివాసీ సమూహాలపై పనిచేసే సంస్థ ‘ది ఇంటర్నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇండిజీనియస్ కమ్యూనిటీస్’ తన నివేదికలో (2014) ప్రపంచ వ్యాప్తంగా 58 దేశాల్లో ఈ సమూహాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తన నివేదికలో ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో చూసినా సామ్రాజ్యవాద విధ్వంసకర అభివృద్ధికి ఆదివాసీలే బాధతులు. ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించు ఈ జాతులన్నీ ఒకేస్థాయిలో వీరి హక్కుల హరణ జరుగుతుందని రాజ్యాలు వీరి రక్షణ తుడిచి పెడుతున్నాయని, వీరి రక్షణకు రాజ్యాలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇటువంటి క్రమంలో ఆదివాసీలకంటూ గుర్తింపు వేదిక అనేది ముందుతరాలకు అవసరమని భావించిన ఐక్యరాజ్యసమితి దృఢ నిశ్చ యంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఆగస్టు 9 ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటితమైంది. దశాబ్దం పాటు ప్రపంచవ్యాప్త ఆదివాసీలపై సమగ్రంగా అధ్యయనం చేసిన ఐక్యరాజ్య సమితి ఆదివాసీల సమస్యలు ఏ దేశంలో చూసినా ఒకే విధంగా ఉన్నాయి. జీవనం విధానం ఒకే విధంగా ఉందని గుర్తించింది. ప్రతి ఏటా ఆగస్టు 9న ఆదివాసీ ప్రపంచ దినోత్సవంగా జరపాలని తీర్మానించింది. అన్ని దేశాల పరస్పర సహకారంతో మానవహక్కులు, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక, ఆర్థిక రంగాలలో ప్రగతి సాధించడానికి కృషిచేయాలని ప్రకటించింది. మనదేశంలోనే దాదాపు 570 గిరిజన తెగలలో దాదాపు 8.44 కోట్ల జనాభా అంటు దేశ జనాభాలో 8.2 శాతం అత్యంత దారుణంగా వెనుకబడి ఏకోశానా అభివృద్ధికి నోచుకోలేని దేశంలో 92 శాతం ఆదిమ తెగలు నేటికి వేట, అటవీ ఫలసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి 34.2% ఆదివాసీ శిశువులు మరణాల పాలవుతున్నారు. 26.6% ఆదివాసీలు ఐదేళ్ల లోపు మరణిస్తుండగా, 5.35% మంది పౌష్ఠికాహార లోపంతో బాధప డుతున్నారని తెలిపింది. దేబార్ కమిషన్ 1961 షెడ్యూల్డ్ తెగలల్లో అ త్యంత వెనుకబడిన జాతులను గుర్తించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో చెంచులు తదితరులు, కేరళలో చొలనయకన్, అండమాన్ నికోబార్‌లో గ్రేట్ అండమానీస్, జఠావా, ఒంగే, సెంతినీలిలు, శోంపెన్ తెగలు, ఛత్తీస్‌గఢ్‌లో బైగా తెగలు, రాజస్థాన్, తమిళనాడులో ‘కోట’ తెగ ఇలా 19 రాష్ట్రాల్లో విస్తరించి వున్న ఈ తెగల పరిస్థితి దుర్భరంగా ఉంది. అస్తిత్వపు అంచుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ తెగలు కాలక్రమేణా అంతరించి పోతున్నా యి. కాలక్రమేణా ప్రవేశపెట్టిన రక్షణ చర్యలు పక్కదారి పట్టి వారి మనుగడనే ప్రమాదంలోకి నెట్టివేశాయి.

కార్పొరేట్ ప్రయోజనాల్లో కొందరి స్వార్థం కోసం వారి సామ్రాజ్యంలోకి చొరబడి సహజ వన రులు, విశాఖలో బాక్సైట్ ఖనిజాలు, నల్లమలలో వజ్రాలు, కన్యధార కొండ అభివృద్ధి పేరుతో కవ్వాలు, అభయారణ్యం ఓపెన్‌కాస్ట్ గనులు, పోలవరం ప్రాజెక్ట్, కొత్తగూడెం విమానాశ్రయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గ్రీన్‌హంట్, ఎకో టూరిజం 1995 జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో 28 రకాల ప్రధాన ఖనిజాలు ఉండటమే కాకుండా అందులో వజ్రాలు 1.30 మిలియన్ టన్నులు కొల్లగొట్టడానికి చూస్తున్నాయి. దేశంలో ఆదివాసీలకు అమూల్యమైన, శక్తిమంతమైన రక్షణ కవచాల లాంటి 1917, 1919, 1935 భారత ఆదివాసీ చట్టాలు పెసా చట్టం 1996. అటవీ హక్కుల చట్టం 2006. 1/70 చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 61989, ఆదివాసీల నిధులు ఆదివాసీలకే అని వేసిన ట్రైబల్ సబ్ ప్లాన్, విద్యా ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు, కేంద్ర, రాష్ట్ర నిధుల పథకాలు, రాజ్యాంగంలో గిరిజన వారసత్వ జీవనానికి సంబంధించిన అధికరణలు (19, 23, 29, 244, 334, 243డి) అంతర్జాతీయంగా కన్వెన్షన్ డిక్టరేషన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ఇండిజీనస్ పీపుల్, ఎన్ని ఉన్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. 

ఇక తెలంగాణలో అయితే విచిత్రకర పరిస్థితి ఆదివాసీలంటేనే ఓర్వ లేని మనస్తత్వం గొత్తికోయలపై లైంగికదాడులు, వారిని చెట్లకు కట్టేసి  కొట్టడం, ఇళ్ళు తగలబెట్టడం నిత్యంకృత్యంగా మారింది. ఆదివాసీ దినోత్సవాలలో ఎన్నో వాగ్దానాలు పలికిన నాయకులు హామీలకు దిక్కే లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీల తల రాతలు మారేదెన్నడో? ఐరాస ప్రకటించిన నివేదికకు భిన్నంగా వ్యవహరించే దేశాలను ఎందుకు నిలదీయటం లేదు? అనేది నేడు ప్రపంచవ్యాప్త మేధావులు ఆలోచించవలసిన అవసరం ఉంది.
పెనుక ప్రభాకర్
ఆదివాసీ రచయితల సంఘం
9494283038

Tags
English Title
Adivasis in the existential crisis
Related News