ఆరుషి హత్య కేసులో మరో మలుపు

Updated By ManamFri, 08/10/2018 - 13:57
Aarushi

Aarushiన్యూఢిల్లీ: ఆరుషి తల్వార్ జంట హత్యల కేసు మరో మలుపు తిరిగింది. తల్వార్ దంపతులను అలహాబాద్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది. దీంతో కేసులో మళ్లీ యూటర్న్ తీసుకుంది.

అయితే దంత వైద్యులైన నూపుర్, రాజేశ్ తల్వార్‌ల కుమార్తె ఆరుషి, వాళ్ల పనిమనిషి హేమరాజ్‌లు 2008లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఘజియాబాద్ కోర్టు, తల్వార్ దంపతులను దోషులుగా పేర్కొంటూ 2013లో యావజ్జీవ శిక్షను విధించింది. అయితే సరైన సాక్ష్యాలు లేని కారణంగా వారిని నిర్దోషులుగా చెబుతూ 2017లో అలహాబాద్ కోర్టు తీర్పును ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ హేమరాజ్ భార్య కుంకాల బంజాడే ఇప్పటికే పిటిషన్ వేయగా.. తాజాగా సీబీఐ కూడా పిటిషన్ దాఖలు చేయడం కేసును మరో మలుపు తిరిగినట్లైంది.

English Title
Aarushi case: Supreme admits CBI appeal against acquittal of parents
Related News