ఏఏఆర్ ఉత్తర్వుపై కలకలం

Updated By ManamFri, 08/17/2018 - 06:26
aar

aarన్యూఢిల్లీ: ఒక కంపెనీ ప్రధాన కార్యాలయం ఇతర రాష్ట్రాలలో ఉన్న తన శాఖల కార్యాలయాలకు అకౌంటింగ్, ఐటీ, మానవ వనరులు వంటి సేవలకు జీతభత్యాలు సమకూరిస్తే దానిపై 18 శాతం జి.ఎస్.టి కట్టాల్సి ఉంటుంది. రెండు ఆఫీసుల మధ్య కార్యకలాపాలను జి.ఎస్.టి చట్టం కింద సరఫరాలుగానే పరిగణిస్తారని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఎ.ఎ.ఆర్) కర్ణాటక ధర్మాసనం జారీ చేసిన ఉత్తర్వు తెలియజేస్తోంది. సరఫరా విలువలోకి అన్ని ఖర్చులు వస్తాయి. ఇందులోకి ఒక సంస్థ ఇతర సంస్థలకు కల్పించే ఉద్యోగి వ్యయం కూడా వస్తుందని ఆ ఉత్తర్వు పేర్కొంది. దీనివల్ల బహుళ రాష్ట్రాలలో ఆఫీసులున్న కంపెనీలు, వాటి ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలలో ఉన్న తమ శాఖలకు సహాయపడే విధంగా నిర్వహించే కార్యకలాపాలకు జి.ఎస్.టి ఇన్‌వాయిస్ తయారు చేయాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. వివిధ రాష్ట్రాల మధ్య నడిచే సర్వీసులన్నింటికీ ఇన్‌వాయిస్‌లను తయారు చేస్తూపోతే, కంపెనీలపై నిబంధనల పాటింపు భారం పెరుగుతుందని చెబుతున్నారు. 

Tags
English Title
The AAR's order is dull
Related News