లీటరు పెట్రోల్‌పై రూ.9.30 తగ్గింపు

Updated By ManamThu, 06/14/2018 - 14:31
9.30 rs cut on litre petrol

9.30 rs cut on litre petrolఒక్క రూపాయి కాదు.. రెండు రూపాయలు కాదు.. పెట్రోల్ ధర లీటరుకు రూ.9.30 తగ్గింది. నిజమే.. మీరు చదివేది నిజమే. కానీ, దేశం మొత్తం తగ్గలేదు. కేవలం మహారాష్ట్రలో మాత్రమే. అది కూడా ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా 48 పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఆ తగ్గంపును అమలు చేస్తున్నారు. కేవలం ఒక్క ముంబైలోనే 36 బంకుల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. దానికీ కారణం లేకపోలేదు లెండి. గురువారం (జూన్ 14) మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాకరే జన్మదినం సందర్భంగా.. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా ఈ తగ్గింపును అమలు చేస్తున్నారు. లీటరు పెట్రోలుపై కనిష్ఠంగా రూ.4, గరిష్ఠంగా రూ.9.30 తగ్గించారు. ఎక్కువ బంకుల్లో రూ.9.30 తగ్గించారు. ఆ నష్టాన్ని పూడ్చేందుకు పెట్రోల్ బంకులకు ఆ తగ్గించిన మొత్తాన్ని ఎంఎన్ఎస్ పార్టీ తరఫున చెల్లించనున్నారు. అయితే, ఈ ఆఫర్ కూడా కేవలం ద్విచక్రవాహనాలకే కావడం విశేషం.

English Title
9.30 rs cut on litre petrol
Related News