కిడ్నీలో 856 రాళ్లు!

Updated By ManamTue, 07/10/2018 - 11:25
kidney stone

శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

kidney stones

న్యూఢిల్లీ : ఒకటి...రెండు కాదు అలా అని ఇరవైయో... ముప్పయో అంతకన్నా కాదు... ఏకంగా 856 రాళ్లు. ఢిల్లీలో ఓ 45 ఏళ్ల వ్యక్తి కిడ్నీ నుంచి వైద్యులు వెలికితీసిన రాళ్ల సంఖ్య ఇది.  మనీష్ గుప్తా అనే వ్యక్తి యూరిన్‌లో రక్తం పడటంతో స్థానిక ఫోర్టీస్ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడికి ఎడమవైపు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. 

వైద్యులు నిన్న (సోమవారం) మనీష్ గుప్తాకు శస్త్ర చికిత్స నిర్వహించగా ...856 రాళ్లు బయటపడ్డాయి. తొలుత 33 మిల్లీమీటర్ల వ్యాసార్థం ఉన్న రెండు రాళ్లను గుర్తించారు. అయితే ఆపరేషన్ చేసే సందర్భంలో కిడ్నీతో పాటు మూత్రనాళంలోనూ రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించి వాటిని తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ... ఓ వ్యక్తి కిడ్నీలో ఇన్ని రాళ్లు ఏర్పడటం అరుదైన విషయమన్నారు. ఈ కేసును ఓ ఛాలెంజ్‌గా తీసుకుని శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
 

English Title
856 stones removed from patient Munesh Kumar Gupta kidney
Related News