2022 నాటికి భారత్‌లో 5జీ సేవలు

5g
  • ట్రాయ్ కార్యదర్శి గుప్త వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌లో 2022 నాటికి 5జీ సేవలను తీసుకువచ్చే దిశగా టెలికాం రంగం ప్రణాళికలు వేస్తుందని ట్రాయ్ కార్యదర్శి ఎస్.కె. గుప్త పరిశ్రమల విభాగం సీఐఐ నిర్వ హించిన ఒక కార్యక్రమంలో గురువారం వెల్లడించారు. రానున్న  ఐదేళ్లలో డిజిట్ ప్లాట్‌ఫాం మరింతవ మెరుగు పడనుం దని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధా, బిగ్ డాటా ఎనలైటిక్స్ వంటివి వినియోగదార్ల వైఖరిని మారుస్తాయని అన్నారు. దేశం లో ప్రస్తుతం 400 మిలియన్ల మంది మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి అధిక మొత్తంలో సమాచార మార్పిడి డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారానే జరుగుందన్నారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగు తున్నందున మీడియా పరివ్రమకూడా వినియోగదార్ల అభిరుచికి తగ్గట్లు సమా చారం అందించే దిశగా ప్రయత్నిస్తు న్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags

సంబంధిత వార్తలు