5,525 కుటుంబాలకు రైతుబీమా 

Parthasarathy
  • బాధిత కుటుంబసభ్యుల ఖాతాల్లోకి 5 లక్షల చొప్పున సొమ్ము

  • కొత్త పాస్‌పుస్తకం పొందినవారి వివరాలూ సేకరణ

  • రైతుబీమాపై వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి సమీక్ష

హైదరాబాద్: రాష్ర్టంలో వివిధ కారణాలతో మృతిచెందిన 5,525 మంది రైతుల కుటుంబాల ఖాతాల్లో రూ.276.26 కోట్లు జమచేసినట్టు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి తెలిపారు. రైతు బీమా పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మృతి చెందిన 5,821 మంది రైతుల వివరాలు ఎల్‌ఐసీ వద్ద నమోదయ్యాయని చెప్పారు. ఇందులో 5,525 మందికి చెందిన నామినీల బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున జమచేసినట్టు తెలిపారు. మిగిలిన 296 మంది రైతుల కుటుంబాలకు కూడా త్వరగా బీమా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివా లయంలో ఆయన రైతుబీమా అమలుపై ఎల్‌ఐసీ, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు మృతి చెందితే వ్యవసాయాధికారులు ఎల్‌ఐసీ నోడల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్ప టికప్పుడు డాటా అప్‌లోడ్ చేసి, బాధిత కుటుం బాలకు తక్షణమే సహాయం అందేలా పనిచే యాలని సూచించారు. నామినీ బ్యాంకు అకౌంట్ల కు సంబంధించి తలెత్తే సమస్యల పరిష్కారానికి త్వరలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించనున్న ట్టు తెలిపారు. డాటా అప్‌డేట్‌చేసే సందర్భంగా ఎడిట్ అప్షన్‌ను పొందుపర్చాలని ఎల్‌ఐసీ అధికా రులను కోరారు. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారి వివరాలను కూడా రైతుబీమాకు సేక రించి.. 2019-20లో ఈ పథకం అమలుకు అవస రమైన బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించనున్న ట్టు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ అదనపు కమిషనర్ విజయ్‌కుమార్, ఎల్‌ఐసీ రీజినల్ మేనేజర్ చందర్, వ్యవసాయశాఖ, ఎల్‌ఐసీ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు