400 ఏళ్లుగా ఆ గ్రామంలో ప్రసవాల్లేవ్

Updated By ManamFri, 05/11/2018 - 14:59
400 Year Since This Village not witnessed single Delivery Cases
  • ప్రసవం జరగాలంటే ఊరు దాటాల్సిందే.. ఆ ఊరుకున్న శాపం అలాంటిది

400 Year Since This Village not witnessed single Delivery Cases

రాజ్‌గఢ్: మధ్యప్రదేశ్ రాష్ట్రం.. రాజ్‌గఢ్ జిల్లా. శంక శ్యాం జీ గ్రామం.. రాష్ట్ర రాజధానికి తిప్పితిప్పికొడితే కేవలం 130 కిలోమీటర్ల దూరం.. కానీ, 400 ఏళ్లుగా ఆ గ్రామంలో ఒక్క ప్రసవమంటే ఒక్క ప్రసవం కూడా జరగలేదు. వినడానికి, చదవడానికి ఆశ్చర్యం కలగొచ్చు.. అన్నేళ్ల నుంచి ప్రసవమే లేకపోతే ఆ ఊళ్లో మనుషులు  ఎక్కడి నుంచి వచ్చినట్టు? అనే అనుమానం రావొచ్చు. అసలు ఎందుకు? అనే ప్రశ్నా ఎదురు కావొచ్చు. నిజమే ఆ ఊళ్లో ఇప్పటిదాకా ప్రసవాలు కాలేదు. ఎందుకంటే ఆ ఊరికి ఉన్న శాపమట. ఆ శాపం వల్లే ఊళ్లో జనం అక్కడ ప్రసవాలు చేయడానికి జంకుతున్నారు. అయితే, ఊరి అవతల ఓ చిన్నపాటి గదిని నిర్మించి అక్కడే మహిళలకు ప్రసవాలు చేయిస్తున్నారు గ్రామస్థులు. ఇదే మొదటి ప్రశ్నకు సమాధానం. అసలిదంతా ఎందుకూ అనే ప్రశ్నకు ముందు చెప్పుకొన్నట్టు ఓ ‘శాపం’.

ఆ శాపమేంటో ఆ గ్రామ సర్పంచ్ నరేంద్ర గుర్జార్ మాటల్లోనే చదవండి. ‘‘క్రీస్తు శకం 16వ శతాబ్దంలో దేవతలు గుడి నిర్మిస్తుండగా.. ఓ మహిళ గోధుమలను దంచుతుండడంతో దేవతల దృష్టి మళ్లి గుడి నిర్మాణం ఆగిపోయింది. దీంతో ఊళ్లో ఎవరూ పిల్లలు కనకుండా దేవతలు శాపం పెట్టారు. ఒకవేళ ఊళ్లో ఎవరైనా పిల్లలను కంటే పుట్టిన బిడ్డతో పాటు తల్లి ప్రాణానికీ హాని జరుగుతుంది’’ అని నరేంద్ర గుర్జార్ అంటున్నారు. ఇక, దాదాపు 90 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని, కొద్దోగొప్పో ప్రసవాలను మాత్రం ఊరి బయట నిర్మించిన చిన్న గదిలో చేస్తుంటారని చెప్పారు. వాతావరణం బాగాలేకపోయినా, వానొచ్చినా, వరదొచ్చినా ప్రసవం అంటే కచ్చితంగా ఊరు దాటాల్సిందేనని చెబుతున్నారు సర్పంచ్. 

English Title
400 Year Since This Village not witnessed single Delivery Cases
Related News