రెండోరోజూ మ్యాచ్ కొనసాగేనా..!

Updated By ManamFri, 08/10/2018 - 16:40
2nd Test, Team India, Lodnon, Toss, England team, Rain 
  •  రెండో టెస్టుకు మళ్లీ వర్షం అడ్డంకి.. 

  • టాస్ పడిన కాసేపటికే మళ్లీ వర్షం.. మ్యాచ్ ఆలస్యం

  • రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. 

  • తొలిరోజు మ్యాచ్‌ రద్దు చేసిన ఆంపైర్లు 

2nd Test, Team India, Lodnon, Toss, England team, Rain లార్డ్స్: రెండో టెస్టుకు మళ్లీ వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. తొలిరోజు వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా, ఒక బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం రోజున రెండో టెస్టు మ్యాచ్‌కు ఆరంభంలో కాస్తా శాంతించిన వరుణుడు.. టాస్ పడి ఆరు ఓవర్లు పూర్తయ్యేలోపే మళ్లీ ఆటంక పరిచాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జే రూట్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన మురళీ విజయ్ ఆండర్సన్ బౌలింగ్‌లో డకౌట్‌గా (0) చేతులేత్తేయగా, కేఎల్ రాహుల్ (8) పరుగులకే మరోసారి ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

2nd Test, Team India, Lodnon, Toss, England team, Rain 6.3 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 11 పరుగులు చేయగా, చతేశ్వర పూజారా (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, తొలి టెస్టులో పరాజయం పాలైన టీమిండియా ఇంగ్లండ్‌పై బదులు తీర్చుకునేందుకు ఎదురుచూస్తోంది. కానీ, వరుణుడు భారత్ ఆశలపై నీళ్లు జల్లినట్టయింది. ఈ రోజైన వర్షం అనుకూలిస్తే మ్యాచ్ ప్రారంభమవుతుంది. లేదంటే ఈ రోజు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది.  

English Title
2nd Test, India tour of Ireland and England at London
Related News