చుక్కలు చూపిస్తున్నారు

Updated By ManamMon, 06/18/2018 - 11:20
2.0 Producers Irk Distributors

2.0 Producers Irk Distributorsసూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో సినిమా అంటే నిర్మాత‌ల‌కు ఏ ఇబ్బంది ఉండ‌దు. మార్కెట్ ప‌రంగా సినిమా హాట్ కేకులా అమ్ముడైపోతుంద‌న్న న‌మ్మకమే దానికి కారణం. కానీ, ఆ నమ్మకం ఇప్పుడు వమ్మైపోతోంది. కారణం.. కొద్దికాలంగా బాక్సాఫీస్ వద్ద రజనీ సినిమా ఫలితాలే. కొచ్చాడయాన్, లింగ‌, క‌బాలి, రీసెంట్ కాలా ఇలా వరుసగా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ప‌రిస్థితి తారుమారైంది. ఈ ఎఫెక్ట్ రజనీ-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న రోబో 2.0పై ప‌డింది. భారీ బ‌డ్జెట్‌తో సినిమాను రూపొందించారు. గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా ఆలస్యమవుతోంది. 2017లోనే విడుద‌ల అవుతుంద‌ని ముందుగా చెప్పినా..  ఇప్పుడా సినిమా మరింత ఆలస్యం కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం.. 2019లో విడుద‌ల‌వుతుందంటున్నారు. దీనివల్ల ఇప్పటికే సినిమాను కొనేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. 

తెలుగు రాష్ట్రాల్లో ‘2.0’ హ‌క్కుల కోసం సునీల్ నారంగ్ 20 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాడ‌ట‌. అయితే సినిమా ఆలస్యం అవుతుండడంతో అతడు ఇబ్బందులు పడుతున్నాడట. ఇదే విషయాన్ని స్వయంగా డిస్ట్రిబ్యూటర్‌ను అడిగితే అదేం లేదు అని స్పందిస్తున్నారట. నిర్మాణ సంస్థ ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగిచ్చేస్తుందని చెబుతున్నాడు. అయితే, అతడు చెప్పినట్టే 2.0ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ అడ్వాన్స్ తిరిగిచ్చేస్తామని చెప్పినా.. డబ్బులు మాత్రం చెల్లించడం లేదట. ఆ కారణం.. ఈ కారణం చెబుతూ దానిని సాగదీస్తూ డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు చూపిస్తున్నారట నిర్మాతలు. మరి, ఆ సమస్య ఎప్పుడు తీరుతుందో.. 2.0 ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందోనన్నది మాత్రం ఇప్పుడు త్రిశంకు స్వర్గంలా మారిపోయింది. చూద్దాం..!

English Title
2.0 Producers Irk Distributors
Related News