ట్రిపుల్ తలాక్‌పై రాజకీయాలు చేయొద్దు

20 Islamic nations have banned triple talaq, says Ravi Shankar Prasad
  • ట్రిపుల్ తలాక్‌పై సభలో గందరగోళం

న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్‌ బిల్లుపై గురువారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ముస్లింలలో అత్యంత అనాగరికమైన ట్రిపుల్ తలాక్‌కు చెల్లుపడేలా రూపొందించిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం చర్చ ప్రారంభించింది. గతంలో ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేపథ్యంలో బిల్లుపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ బిల్లును జేపీసీకి పంపించాలని డిమాండ్ చేయగా, టీఎంసీ, ఎంఐఎం మద్దతు తెలిపాయి.

కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ... 20 ఇస్లామిక్ దేశాల్లో ట్రిపుల్ తలాక్‌ను బ్యాన్ చేశారని, మహిలల సమాత్వం కోసం ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకువచ్చామని, ఇది మతానికి వ్యతిరేకమైందని కాదని అన్నారు. ట్రిపుల్ తలాక్‌పై రాజకీయాలు చేయొద్దని, ఈ బిల్లుపై  పార్లమెంట్ మొత్తం ఒకే మాటమీద ఉండాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు.

సంబంధిత వార్తలు