జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 11మంది మృతి

Updated By ManamFri, 09/14/2018 - 11:55
Road Accident

Road Accidentశ్రీనగర్/జమ్ము: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టవర్ జిల్లాలోని థాక్రియా దగ్గర ప్రయాణికులతో వెళుతున్న బస్సు జారి లోయలోకి పడటంతో పదకొండు మంది అక్కడికక్కడే మరణించారు. మరో పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సామర్థ్యానికి మించి బస్సులో ప్రయాణికులు ఉండటం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు. కేసును నమోదు చేసుకున్నామని, దర్యాప్తును చేపట్టామని అన్నారు. కాగా ఇటీవల తెలంగాణలో ఇదే తరహాలో జరిగిన కొండగట్టు రోడ్డు ప్రమాదంలో 60మంది మృతి చెందగా.. పలువురు గాయాలపాలైన విషయం తెలిసిందే.

English Title
11 killed in Kishtwar Bus Accident
Related News