10వేల పరుగుల క్లబ్‌కు చేరువలో ధోనీ

Updated By ManamWed, 07/11/2018 - 23:30
dhoni

imageటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అదురైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకొనేందుకు ధోనీ ఇంకా 33 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్ల్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో ధోనీ ఈ రికార్డును సాధించే అవకాశం ఉంది. శుక్రవారం నాట్టింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది.

ఈ మ్యాచ్‌లో ధోనీ 33 పరుగులు చేస్తే.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ తర్వాత 10వేల పరుగుల క్లబ్‌లో చేరిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్‌లో చేరిన 12వ క్రికెటర్‌గా ధోనీ ఘనత సాధించే అవకాశం ఉంది. ఈ క్లబ్‌లో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. సచిన్ ఆడిన అన్ని వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. ఆ తర్వాత 14,234 పరుగులతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార, 13,704 పరుగులతో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నారు.

English Title
10వేల పరుగుల క్లబ్‌కు చేరువలో ధోనీ




Related News