తమిళనాడులో దారుణం...

Updated By ManamSun, 07/22/2018 - 09:31
www Regling
  • క్లాస్‌లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ రెజ్లింగ్‌ తరహాలో ఫైటింగ్‌..

  • తోటి విద్యార్థిని నేలకేసి కొట్టిన మరో విద్యార్థి

  • తలకు బలమైన గాయంతో మృతి

 Fatima Matriculation schoolచెన్నై : తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ రెజ్లింగ్‌ తరహాలో ఓ స్కూల్‌​ క్లాస్‌ రూమ్‌లో జరిగిన ఫైటింగ్‌లో  విద్యార్థి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోయంబత్తూరు జిల్లా కయత్తూరులోని ఫాతిమా మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో ఓ విద్యార్థిని సహ విద్యార్థి నేలకేసి కొట్టాడు. తల నేలకు బలంగా తగలడంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. వారం రోజుల క్రితం (జూలై 16న) ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతం మొత్తం క్లాస్‌ రూమ్‌ లోని సీసీ కెమెరాలో రికార్డు అయింది.

లంచ్‌ విరామ సమయంలో పదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన వివాదం చిలికి చికిలి గాలివానలా మారింది. దీంతో రెజ్లింగ్‌ తరహాలో ఆ విద్యార్థిని.. తన తోటి విద్యార్థిని క్లాస్‌ రూమ్‌లో నేలకేసి కొట్టాడు. అయితే కిందపడిన విద్యార్థి పైకి లేస్తాడనుకున్నా...అప్పటికే అతడు చనిపోయాడు.

కాగా  మృతి చెందిన విద్యార్థి కుటుంబసభ్యులు మాత్రం కావాలనే తమ కుమారుడిని తోటి విద్యార్థి హతమార్చాడంటూ ఆరోపించారు. అంతేకాకుండా ఆ విద్యార్థి ఇంటిపై దాడి చేసి, నిప్పు పెట్టారు.  ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
10th student dies in fight in tamilnadu school class room
Related News