100 శాఖలకు పెంచాలె

kavith
  • టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ వార్షికోత్సవాల్లో కవిత

  • కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూస్క పోతుంది

  • మన ఇండస్ట్రియల్ పాలసీని అమెరికా వారు మెచ్చుకుంటున్నరు

  • 33 దేశాలకు విస్తరించిన టీఆర్‌ఎస్ శాఖలు

హైదరాబాద్: 100 ఎన్నారై శాఖలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ పని చేయాలని కల్వకుంట్ల కవిత అన్నారు. 8వ వార్షికోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ, టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ బాధ్యురాలు కల్వ కుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లికి పూల మాల వేసి, వార్షికోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్నారైలకు కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ. యూకె, యూఎస్‌లతో మొదలైన టీఆర్ ఎస్ ఎన్నారై శాఖలు ఇప్పుడు 33 దేశాలకు విస్తరించాయని చెప్పారు. రానున్న రోజుల్లో 100 శాఖలను ఏర్పాటు చేసి, ఆయా దేశాల్లో గులాబి జెండాలను రెపరెపలాడిస్తామన్నారు. ఈ పనిలో ఎన్నారై టీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న టీఆర్‌ఎస్  కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, ఆయన మార్గదర్శనంలో పనిచేస్తూ...తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ఎన్నారైలకు కవిత పిలుపునిచ్చారు. 

ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్  సారు సైతం విదేశాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారని, ఆయన సూచనలతో విదేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలు వివిధ పేర్లతో సంఘాలు పెట్టుకుని పనిచేసిన విషయం తెలంగాణ సమాజం మరువదన్నారు. శాఖలు ఏర్పాటు చేసిన సమయంలో రకరకాలుగా అవమానాలు, అవహేళనలు ఎదుర్కోన్న విషయం మనందరికి తెలుసునన్నారు. కంట తడి పెట్టిన ఎన్నారైలూ నాకు తెలుసునన్నారు. నవ్విన నాప చేను పండిన చందంగా తెలంగాణ సాధించుకున్నామని కవిత తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని.. ఇక, రెండవ సారి మరోసారి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ రెండో సారి కూడా అధికారంలోకి వచ్చామని కవిత వివరించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు. మన ఇండస్ట్రియల్ పాలసీని చూసి అమెరికా వాసులు ఇలాంటి పాలసీ మా వద్ద లేదన్న విషయం తెలంగాణ బిడ్డలుగా మనకు గర్వకారణం అన్నారు. తెలంగాణను చూసి, మన ప్రభుత్వ పనితీరు..రాష్ర్టం అభివృద్ది చెందుతున్న విధానం చూసి మీరు గర్వపడేలా చేస్తామని ఎంపి కవిత అన్నారు. ఎన్‌ఆర్‌ఐల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు ఇప్పటికే మంజూరు అయ్యాయని, త్వరంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నారై పాలసీని ప్రకటిస్తారని కవిత తెలిపారు. అభివ ద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు, గల్ఫ్ వంటి దేశాల్లో తెలంగాణ బిడ్డల సమస్యలు ఒక్కో రకంగా ఉన్నాయన్నారు. అక్కడి వారికి, ఇక్కడ పార్టీకి వారధులుగా ఎన్నారై సెల్స్ పనిచేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని వీడకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. మనమంతా కలిసి  పనిచేస్తే దేశానికే కాదు ప్రపంచానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఎంపి కల్వకుంట్ల కవిత. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, బేవరేజెస్ కార్పోరేషన్ ఛైర్మన్ దేవీ ప్రసాద రావు, టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, టీఆర్‌ఎస్ యూకె అధ్యక్షులు అశోక్ దూసరి, న్యూజిలాండ్ శాఖ కోశాధికారి అభిలాష్ రంగినేని, యూఎస్ ప్రతినిధులు సుధీర్, సురేశ్, రమేశ్,టీఆర్‌ఎస్ ఖతార్ ప్రతినిధి అభిలాష్ బండి, సౌత్ ఆఫ్రికా ప్రతినిధి రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Tags

సంబంధిత వార్తలు