నిత్య యవ్వనం కోసం.. పది చిట్కాలు!

Updated By ManamThu, 07/12/2018 - 18:47
healthy, young and healthy, younger looking skin

నిత్య యవ్వనంతో ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అలా ఉండాలని చాలామంది ఎన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనకాడరు కూడా. మధ్య వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రావడంతో మరింతగా కృంగిపోతుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించాలనేది ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలి. అలాంటి గజిబిజీ జీవితంలో వ్యాయమానికి ఎంతోకొంత సమయం కేటాయిస్తే నిత్య యవ్వనాన్ని మీ సొంతం  చేసుకోవచ్చు.

healthy, young and healthy, younger looking skinవెబ్ ప్రత్యేకం: నిత్య యవ్వనంతో ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అలా ఉండాలని చాలామంది ఎన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనకాడరు కూడా. అలాంటి గజిబిజీ జీవితంలో వ్యాయమానికి ఎంతోకొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు, మానసిక ఒత్తిడి వంటివి ఎదురవుతుంటాయి. గంటలపాటు ఆఫీసుల్లోని కూర్చీలకు అత్కుకపోవడం వల్ల అనారోగ్య సమస్యలతో సతమతవుతుంటారు. దాంతో మధ్య వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రావడంతో మరింతగా కృంగిపోతుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించాలనేది ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలి. వయస్సు పైబడినప్పటికీ, నిత్య యవ్వనంగా, అరోగ్యంగా ఉండేందుకు అద్భుతమైన చిట్కాలు ఎన్నో వున్నాయి. అందులో పది చక్కనైన చిట్కాలు మీకోసం.. 

1. చక్కని నిద్ర..
కంటినిండా నిద్రపోవాలి. రోజుకు 6-8 గంటల పాటు చక్కగా నిద్రపోవాలి. నిద్రలేమి కారణంగా హుషారుగా ఉండలేరు. సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై ఎన్నో దుష్ర్పభవాలను కలిగిస్తుంది. ఫలితంగా అనారోగ్యానికి గురవుతారు. అందుకే ప్రతిఒక్కరూ రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం ఎంతో ముఖ్యం. నిద్ర వల్ల శరీరంలోని మెటబాలిజం మెరుగుపడేందుకు దోహదపడుతుంది. దాంతో ఆరోజుంతా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు. ఆరోగ్యంతో పాటు మీ చర్మం కూడా నిత్య యవన్వంలా మెరిసిపోతుంది. 

2. మార్నింగ్ జాగింగ్.. 
ఉదయాన్నే లేవాలంటే బద్దకంగా ఉంటుంది. ఉదయం లేవగానే మార్నింగ్ వాకింగ్, జాగింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. కొందరూ అతికష్టం మీద ఒకటి రెండు రోజులు చేసి మానేస్తుంటారు. అలా కాకుండా ప్రతిరోజూ తమ దినచర్యలో అదో భాగంగా అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం లేవగానే కనీసం 30 నిమిషాల పాటు జాగింగ్ చేయడం వంటి చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. వారానికి మూడు నుంచి నాలుగు గంటల పాటు వ్యాయామం చేస్తుంటే.. మీ శరీరంలోని వ్యాధినిరోధక శక్తి పటిష్టంగా మారుతుంది. తద్వారా ఎలాంటి రోగాలు దరిచేరవు. 

3. తాజా పండ్లు, కూరగాయాలు
ఆరోగ్యమైన శరీరం, నిత్య యవ్వనం కలిగిన చర్మం మీ సొంతం కావాలంటే ప్రతిరోజూ ఆహారపు అలవాట్లలో మార్పులు తప్పనిసరి. ముఖ్యంగా మీ దినచర్యలో తాజా పండ్లు, కూరగాయాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. తద్వారా మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యకరమైన శరీరంతో పాటు చర్మంలోని కాంతి మెరుగుపడి ఎంతో యువ్వనంగా కనిపిస్తారు.   

4. ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలి..
చర్మం పొడిబారకుండా ఉండేందుకు శరీరంలో నీటిశాతం తగిన మోతాదులో ఉండాలి. అప్పుడే శరీరంలోని తేమ కోల్పోకుండా ఉంటుంది. ప్రతిఒక్కరూ రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల శరీరంలో నీటిశాతం పెరగడమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతోపాటు చర్మం హైడ్రేట్ అయ్యేందుకు ఉపకరిస్తాయి. చర్మంలో పేరుకపోయిన వ్యర్థమలినాలను బయటకు వెళ్లిపోతాయి.

5. చర్మ రక్షణకు సన్‌స్రీన్ లోషన్లు.. 
చర్మానికి హాని కలిగించే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ పొందాలంటే చర్మానికి నొప్పే సన్‌‌స్రీన్ లోషన్లు రాసుకోవాలి. బయటి ఎండలోకి వెళ్లే సమయంలో సూర్యరశ్మి తాకే చర్మం పైభాగాలకు ఈ తరహా లోషన్లు పూయడం చేత హానికరమైన కిరణాలు చర్మం లోపలికి చొచ్చుకొనిపోలేవు. తద్వారా చర్మం డిహ్రైడేషన్‌కు గురికాకుండా కాపాడుకోవచ్చు. 

6. ధ్యానం.. యోగా.. 
అనారోగ్యానికి కారణమయ్యే మానసిక ఒత్తిడులను దూరం చేయాలంటే అందుకు మనస్సును ఉల్లాసపరుచుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు చక్కని మార్గాలు.. ధ్యానం చేయడం.. యోగా ఆసనాలు వేయడం వ్యాయామపరంగా ఎంతో ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడుల నుంచి బయటపడవచ్చు. అలాగే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఎల్లప్పుడూ పాజిటివ్ ఆలోచనలతోనే ఉండాలి.. నెగటివ్ ఆలోచనలను దరిచేరనీయకుండా ఇలాంటి వ్యాయమాలతో మానసిక ఒత్తిడులను జయించి సంతోషంగా ఉండవచ్చు. 

7. విటమిన్లు ఉండే కాయగూరలు.. 
వన్య క్యాబేజీ (బ్రోకలీ), రెడ్ పెప్పర్స్ (ఎరుపు మిరియాలు), క్యాలిఫ్లవర్‌లో యాంటీ యాక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఈ కాయగూరలు మంచి డైట్‌గా పనికివస్తాయి. ముఖ్యంగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చని కూరగాయాల్లో అధికశాతంలో విటమిన్లు (ఏ, సీ, ఈ) వంటి ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మీ చర్మంలోని కణజాలాలను దెబ్బతినకుండా రక్షించేందుకు దోహదపడుతాయి.  

8. మార్నింగ్ వాక్.. 
ప్రతిరోజూ ఉదయం లేవగానే నడవడం అలవర్చుకోండి. ఇలా కాసేపు నడవడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. రోజువారీ జీవితంలో కొంతసేపు నడకకు సమయం కేటాయించడం వల్ల రోజులో ఎదురయ్యే ఒత్తిడులను సులభవంగా అధిగమించవచ్చు. తద్వారా మనస్సు ఉత్తేజపడి ఒత్తిడి మటుమాయమైపోతుంది. 

9. హాయిగా నవ్వండి..
ఒత్తిడి, నెగటివ్ ఆలోచనలే అనారోగ్యానికి మూల కారణం. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నవ్వు ఆరోగ్యానికి చిహ్నం. నవ్వినప్పుడు కలిగే కండరాల వ్యాకోచం వల్ల ముఖంపై రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా వృద్ధాప్య ఛాయలు, చర్మం ముడతలు వంటి మటుమాయమై పోతాయి. వయస్సు పైబడుతున్న కొద్దీ ఒత్తిడి, నెగటివ్ ఆలోచనల ప్రభావంతో అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉంది. జీవితంలో సవాళ్లు ఎదురైనట్టు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే ముందుగా ఒత్తిడి, నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. సమస్యాత్మక పరిస్థితులను సైతం అంగకరీంచి ధైర్యంగా నిలబడాలి. ఒకదాని తరువాత మరొకటి సమస్యను ఛేదించుకుంటూ ముందుకు సాగాలి. 

10. రెగ్యులర్ హెల్త్ చెకప్..
వయస్సు పైబడుతున్న కొద్ది మీ ఆరోగ్యం విషయంలో అవసరాన్ని బట్టి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు కావాల్సిన విలువైన పోషకాలను తీసుకుంటుండాలి. అవసరమైన శారీరక శ్రమతో పాటు వ్యాయామం వంటి వాటితో వ్యాధులను తట్టుకోనేలా మీ శరీరాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. 

English Title
10 tips to look young and healthy
Related News