ఇంధన ధరలు విపరీతంగా పెరగకుండా నిరోధించడానికి పన్నులను తగ్గించడమే ఉత్తమ మార్గమని, దీనివల్ల ఎగుమతుల రూపేణా భారతదేశానికి బ్రహ్మాండమైన మేలు చేకూరుతుందని పరిశ్రమల సంఘాల సంస్థ ‘అసోచామ్’ పేర్కొంది.
దేశంలో 2.25 లక్షల కంపెనీలు, 7,191 పరిమిత లయబిలిటి  భాగస్వామ్య సంస్థ (ఎల్‌ఎల్‌పీ)లు నిబంధనలకు అనుగుణంగా ప్రకటించవలసిన ఫలితాలను 2015-16, 2016-17 అర్థిక సంవత్సరాలకు సంబంధించి వెల్లడించలేదు.
స్ట్రెస్సడ్ ఖాతాలను వేగంగా పరిష్కరించేందుకు అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటుపై రెండు వారాల్లోగా సిఫార్సులు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారంనాడు ప్రకటించారు.
రెండు సెషన్లలో భారీ లాభాలను చూసిన షేర్లు శుక్రవారం కాస్త విశ్రమించాయి. కీలకమైన జి 7 (ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్, అవెురికా, కెనడా, ఇటలీ) సమావేశానికి ముందు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై అనిశ్చిత పరిస్థితుల మధ్యలో ఇన్వెస్టర్లు ఇటీవల బాగా పెరిగిన షేర్లను విక్రయించి లాభాలు సొంతం చేసుకున్నారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్లు తగ్గుతాయట. జీఎస్టీ రేట్ల తగ్గింపుపై త్వరలోనే కీలక ప్రకటన వెలువడనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా వెల్లడించారు.
వరుసగా పదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.
స్థాపించినప్పటి నుంచే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ‘బిగ్ సి’ మొబైల్ తన 200వ షోరూంను ప్రారంభించి మరో మైలు రాయిని చేరుకుంది.
ఇండియాలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2016లో ఉన్న 44 బిలియన్ డాలర్ల నుంచి 40 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇండియా నుంచి విదేశాలకు పెట్టుబడులు మాత్రం రెండింతలకు పైగా పెరిగాయని ఐక్యరాజ్య సమితి తయారు చేసిన నూతన వర్తక నివేదిక వెల్లడించింది.
నగదు కొరతతో బాధపడుతున్న చక్కెర పరిశ్రమకు విముక్తి కల్పించే రూ. 7,000 కోట్ల ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేంద్ర మంత్రవర్గ ఉప సంఘం బుధవారం ఆమోదం తెలిపింది.
ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు అయ్యే ఖర్చులో 50 శాతం తగ్గించే అవకాశం ఉన్న సరికొత్త పోర్టబుల్ ఎంఆర్‌ఐ స్కానర్‌ను టాటా ట్రస్టుకు చెందిన నవకల్పనలు, సామాజిక వ్యవస్థాపక సామర్థ్య ప్రోత్సాహక ఫౌండేషన్ తయారు చేసింది.


Related News