కృత్రిమ మేధస్సుతో పని చేసే ‘థింక్యూ’ ఓలీడ్ స్మార్ట్ టీవీని ఎల్‌జీ సంస్థ హైద్రాబాద్‌లో మంగళవారం ఆవిష్కరించింది.
అమెరికా ప్రభుత్వానికి చెందిన డెవలప్‌మెంట్ ఫినాన్స్ ఇన్‌స్టిట్యూషన్ ‘ఓపిక్’ భారతదేశంలో మౌలిక వసతుల అభివృద్ధిలో ముఖ్యంగా పోర్టులు, సౌర విద్యుత్ రంగాల్లో  పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు.
ప్రస్తుత 2018 సంవత్సరంలో ఇండియా 7.3 శాతం వృద్ధి రేటు సాధించగలదని, 2019లో అది 7.4 శాతంగా ఉండగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్) మంగళవారం అంచనాలను వెల్లడించింది.
అసమానతలను తగ్గించడం పట్ల నిబద్ధత చూపడంలో ఇండియా పనితీరు పేలవంగా ఉంది. మొత్తం 157 దేశాల జాబితాలో దానికి ఈ విషయంలో 147వ స్థానం దక్కింది.
భారతీయ క్యాపిటల్ మార్కెట్ లో పార్టిసిపేటరీ నోట్స్ ద్వారా  ఇన్వెస్ట్ మెంట్లు ఆగస్టు నెలాఖరు నాటికి రూ. 84,647 కోట్లకు చేరాయి.
ఎస్.బి.ఐ మెక్వారి, స్టాండర్డ్ చార్టర్డ్ తో  సహా  ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లతో కొనసాగుతున్న మధ్యవర్తిత్వ కేసును పరిష్కరించుకున్నట్లు  జి.ఎం.ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్టర్ లిమిటెడ్ (జి.ఐ.ఎల్) సోమవారం వెల్లడించింది.
మహీంద్రా మ్యూచుఫల్ పండ్ సరికొత్త మ్యూచువల్ ‘మహీంద్రా రూరల్ భారత్ అండ్ కన్జంప్షన్ యోజన’ పేరుతో కొత్త ఈక్విటి పథకాన్ని ప్రవేశపెటిటంది.
అభివ ద్ధి చెందిన ప్రధాన మార్కెట్లలో డిమాండ్ మందగించడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు కాలంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 0.75 శాతం సంకోచించి 13.18 బిలియన్ డాలర్లుగా నిలిచాయి.
తీవ్ర ఆటుపోట్లతో సాగిన సెషన్‌లో, ఇటీవల దెబ్బతిన్న, చౌక ధరకు లభిస్తున్న బ్యాంకింగ్, చమురు, ఇంధన వాయు, మోటారు వాహనాల రంగ షేర్లను మదుపరులు కొనుగోలు చేయడంతో, మూడు రోజులుగా కొనసాగిన పతన పరంపరకు, సోమవారం తెరపడింది.
పీమియం విభాగంలో  రానున్న 12-18 నెలలో కనీసం 10 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని ప్రముఖ కుకీస్ తయారీ సంస్థ యునీబిక్ ప్రణాళికలు వేస్తోంది.


Related News