మార్కెట్లు ప్రారంభంలో గడించిన లాభాలను కోల్పోయినప్పటికీ వరుసగా మూడవ సెషన్‌లో బుధవారంనాడు అధిక స్థాయిల్లో ముగిశాయి.
ప్రభుత్వ శాఖలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు నిర్వహించదలచిన సదస్సులు, సమావేశాలు, వర్క్‌షాపుల ఖర్చు రూ. 40 లక్షలు మించే పక్షంలో అవి  ఇకపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ముందుగా ఆమోదం పొందవలసి ఉంటుంది.
ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మే నెలలో మంచి వృద్ధిని సాధించినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియాం) తెలిపింది.
భారతీయ కంపెనీలు ప్రపంచంలో అత్యంత ఆశావహ యాజమాన్యాలలో ఏడవ స్థానంలో ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో నియామకాల పథకాలపై అవి 17 శాతం ‘బుల్లిష్’గా ఉన్నాయని ఒక సర్వేలో వెల్లడైంది.
అటల్ పెన్షన్ యోజన (ఎ.పి.వై) కింద పెన్షన్ పరిమితిని ఇప్పుడున్న శ్లాబ్ రూ. 5,000 నుంచి రూ. 10,000లకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా ఉత్పత్తి భారీగా పెరిగినట్లు కేంద్ర మంత్రి పీయష్ గోయల్ అన్నారు. బీజేపీ పాలనకు నాలుగేండ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా, ఉత్తరకొరియా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య జరిగిన కీలక భేటీ సక్సెస్ కావడంతో మదుపర్లు కొనుగోళ్ల వైపు ఆసక్తి కనబర్చారు.
ఇండియన్ బ్యాంక్ నిర్ణీతకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి) అమలులోకి తెచ్చిన తర్వాత కూడా ఎగుమతిదార్లు చెల్లిస్తూ వస్తున్న పన్నులను, ఎంబెడ్డెడ్ వాటితో సహా, రిఫండు చేసే యంత్రాంగాన్ని కనుగొనేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది.
ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రానికి ఉన్న ఒక మార్గం వివిధ వాటాదారులను కూడగట్టుకోవడవేునని నీతి ఆయోగ్ వైస్- చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.


Related News