దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలలో జూలై-సెప్టెంబర్ కాలంలో గృహాల అమ్మకాలు 6 శాతం పెరిగి 51,142 యూనిట్లుగా నిలిచాయని ప్రాప్‌ఈక్విటీ డాటా సూచిస్తోంది.
భారత్‌లో ప్రస్తుతం ఏడాదికి 90 బిలియన్లుగా ఉన్న కోడిగుడ్ల ఉత్పత్తి  100 బిలియన్లకు అతి త్వరలో చేరనున్నట్లు ప్రభుత్వం శుక్రవారంనాడు వెల్లడించింది.
ఉత్తరాఖండ్‌కు రూ. 700 కోట్ల పెట్టుబడితో 500 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు అందించేందుకు ఆ ప్రభుత్వంతో ఒక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా-బీవైడీ ఇటీవల వెల్లడించింది.
ప్రైవేటు రంగ కర్ణాటక బ్యాంక్ 2018 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో నికర లాభాన్ని 20 శాతం పెంచుకుని రూ. 111.86 కోట్లుగా నమోదు చేయగలిగింది.
భారతదేశపు రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో స్వల్పంగా పెరిగి 3.77 శాతంగా ఉంది. అధిక ఇంధన, ఆహార ధరలు దీనికి కారణమని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన డాటా వెల్లడించింది.
ముడి చమురు ధరల్లో తగ్గుదల, రూపాయిలో రికవరీ రెండూ కలసి బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ను శుక్రవారం పైకెత్తాయి.
విమాన ఇంధనం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కన్నా చౌక ధరకు లభిస్తోంది. చోద్యంగా కనప డుతున్నా ఇది వాస్తవం.
మలేషియాకు చెందిన శానిటరీ ఉత్పత్తుల తయారీ సంస్థ టైటానియం వరల్డ్ టెక్నాలజీ సంస్థ భారత్‌లోకి అడుగుపెట్టింది.
వచ్చే రెండేళ్ళలో పార్సెల్ వ్యాపారంలో మార్కెట్ వాటాను రెండింతలకు పైగా పెంచుకోవాలని తపాలా శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.


Related News