నైరుతి రుతుపవనాల ఉపసంహరణలో జాప్యం గోధుమలు, ఆవాలు వంటి శీతాకల (రబీ) పంటలకు మేలు చేస్తుందని, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తనాలు వేయడం మొదలైందని వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్.కె. మల్హోత్రా తెలిపారు.
సౌదీ అరేబియా, ఇరాక్ వంటి సరఫరాదారులతో ఐ.ఓ.సి వంటి ఇండియన్ ఆయిల్ కంపెనీలు కుదుర్చుకున్న వార్షిక ముడి చమురు కొనుగోలు కాంట్రాక్టులలో ఐచ్ఛిక వాల్యూముల వాటా దండిగా ఉంది.
ఐ.ఎల్ అండ్ ఎఫ్.ఎస్, ఇతర గ్రూప్  కంపెనీలపై ప్రొసీడింగులన్నింటిపైన తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్  సోమవారం స్టే మంజూరు చేసింది.
జీడిమెట్లలో ఉన్న యాక్టీవ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ (ఏ.పి.ఐ)ని ప్రవర్థమాన జనరిక్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ థెరపీవాకు విక్రయించేందుకు ఖరారు ఒప్పందం కుదిరినట్లు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సోమవారం ప్రకటించింది.
బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి సోమవారం సుమారు 132 పాయింట్లు లాభపడి 34,865.10 వద్ద ముగిసింది.
దశాబ్దకాలంగా వీఈ కమర్షియల్ వెహికిల్స్‌ను  సంయుక్తంగా నిర్వహిస్తున్న  వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజాలు వోల్వో, ఐషర్ మోటార్స్‌లు కంపెనీలు భారత్‌లో  రూ. 400 కోట్లతో మరోకొత్త తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు ప్రకటించాయి.
ఈ నెల 16 నుంచి  మూడు రోజుల పాటు జరిగే ‘ఇండియా ఇంటర్నేషనల్ సిల్క్ ఫెయిర్’ కార్యక్రమాన్ని కేంద్ర టెక్స్‌టైల్ మంత్రి స్మృతి ఇరాని మంగళవారం ఆవిష్కరించనున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 17,44,305 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సియామ్ ఇటీవల వెల్లడించింది.
వ్యక్తిగత అవసరాలకు, గృహాలకు, కార్లకు ఇలా ప్రతిదానికి సొంతంగా డబ్బులు లేకపోయిన రుణ సదుపాయాలను వినియోగిస్తుంటాం.
అమెరికాకు చెందిన ప్రముఖ మోటర్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్ సన్ భారత వ్యవహారాల డైరెక్టర్‌గా సజీవ్ రాజశేఖరన్‌ను నియమించు కుంది.


Related News