కోల్ ఇండియా కొన్ని దశాబ్దాల కాలంలో ఉత్పత్తిలో తరచు రెండు సంఖ్యలలో వృద్ధిని కనబరుస్తూ వచ్చినా రైలు రవాణాలో ప్రతిబంధకాల వల్ల  బొగ్గు లభ్యత ఒక సమస్యగా ఉంటూ వచ్చింది.
నగదు హోల్డింగ్ పరిమితిని ఇంతకుముందు సూచించినట్లుగా రూ. 20 లక్షలకుకాక, రూ. 1 కోటిగా నిర్ణయించాలని గుప్త ధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిఫార్సు చేసింది.
తరచు ఉపయోగిస్తున్న ‘‘పాలనాపరమైన సాధనాలు’’ వ్యవసాయ రుణాల మాఫీకి వ్యతిరేకంగా కేంద్రంతో సహా, ప్రభుత్వాలను రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యూటి గవర్నర్ ఆర్. గాంధీ హెచ్చరించారు.
‘సెన్సెక్స్’ శుక్రవారం 145 పాయింట్లకు పైగా పెరగ్గా, ‘నిఫ్టీ’ 11 వేల స్థాయికి ఎగువన స్థిరపడింది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన, ఔషధాల తయారీ విభాగాల్లో షేర్ల పెరుగుదల స్టాక్ మార్కెట్ సూచీల ఆరోహణకు తోడ్పడ్డాయి.
కోటక్ మహీంద్రా బ్యాంకు 2018-19 మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.  ఏకీకృత నికర లాభం రూ. 2,232 కోట్లుగా బ్యాంకు వెల్లడించింది.
ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్ కేటాయింపు ద్వారా 2018-19లో రూ. 1790 కోట్ల మూలధనాన్ని సమకూర్చే ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ వెల్లడించింది.
వివాదాస్పద ఫినాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ (ఎఫ్.ఆర్.డి.ఐ) బిల్లును చేపట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించడం, బ్యాంక్ ఖాతాదారులు ఊపిరి పీల్చుకునేట్లు చేసింది.
ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌కు టిగోర్ ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేసే ఆర్డరు దక్కినట్లు టాటా మోటార్స్ ఇటీవల తెలిపింది.
బాండ్ల జారీ ద్వారా రూ. 2000 కోట్లను సమీకరించనున్నట్లు ఇ.సి.ఎల్ ఫినాన్స్ వెల్లడించింది. ఇడెల్‌వెయిస్  ఫినాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ సంస్థ ఇ.సి.ఎల్ ఫినాన్స్.
రుణాల భారంతో కుంగిన ఎస్సార్ స్టీల్ స్వాధీనానికి ఆర్సిలార్ మిత్తల్, రష్యాకు చెందిన వి.టి.బి క్యాపిటల్ దన్ను ఉన్న నువెుటల్ సంస్థలు సమర్పించిన బిడ్ల  అర్హతకు సంబంధించి వాటి నుంచి వచ్చిన పిటిషన్లపై జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ బుధవారం తన ఆదేశాలను రిజర్వులో ఉంచింది.


Related News